Saturday, April 16, 2011

తల్లికో బహుమతి

తమిళం: పి.ఎన్. సత్యమోహన్
అనువాదం: శివారెడ్డి
ప్రచురణ : నవ్య ఏప్రిల్ 13, 2011



ఇంతకు ముందు అది నాకు తట్టలేదు
చెంపల దగ్గర తెల్లబడుతున్న ముప్ఫయ్యారేళ్ళ వయసులో
నాకు రెండింతల వయసుండి
వృద్ధాశ్రమంలో వుంటున్న మా అమ్మకి
ఓ బహుమతి కొనివ్వాలని ఇప్పుడు తట్టింది
జుట్టు తెల్లబడుతున్న ముప్ఫయ్యారేళ్ళ వయసులో
మా అమ్మకో బహుమతి కొనివ్వాలని!

చక్కని ఉన్నిపరుపు పరిచిన
ఉయ్యాలెందుకు కాకూడదు
నన్ను తొమ్మిది నెలలు కడుపులో
ఉయ్యాలలూపి అన్నివేళలా
సౌకర్యాన్నిచ్చిన ఆమె గుర్తుకోసం
కృతజ్ఞతాపూర్వకంగా చక్కని ఉయ్యాలెందుకు కాకూడదు

నే వూదిన గాలితో నిండిన గాలిదిండెందుకు కాకుడదు
ఆమె మీద కాళ్ళేసి దిండులాగా
ఆమె పక్కలో పడుకున్న నా బాల్యం రోజులకు గుర్తుగా
నా అనంతప్రేమతో నిండిన
గాలిదిండెదుకు కాకూడదు

నా యౌవనంలో
నానాలుకకోరిన యాభైరకాల దిక్కుమాలిన వంటకాలనీ
చేతులు కాలింది పట్టించుకోకుండా వండిపెట్టిన మా అమ్మని
ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకెళ్ళి
బ్రహ్మాండమైన భోజనం ఎందుకు పెట్టించకూడదు?

ఆ రోజులకు గుర్తుగా,
నాన్న ఆనారోగ్యంగా వున్నప్పుడు
కుటుంబం మొత్తం కుంగిపోతున్నప్పుడు
సంసారాన్ని నడపటానికి, ఎన్ని ఇళ్ళల్లోనో పనిమినిషిగా చేసి,
తను మందులు కొనుక్కోకుండా,
నాకు పుస్తకాలు కొనిపెట్టిన ఆ రోజులకు గుర్తుగా,
ధన్యవాదాల్తో ఒక వేయిపేజీల నవల రాసి,
అచ్చేసి ఆమెకెందుకివ్వగూడదు?

విధవరాలై వుండి కూడా నాకో వధువును చూసి పెళ్లిచేసి
మా మానాన మమ్మల్ని బతకనివ్వటానికి
వదిలిపెట్టిన మా అమ్మకి గుర్తుగా కృతజ్ఞతాపూర్వకంగా
మా ఆవిడతో కలిసి ఒక ఫోటో తీసి
ఆమెకెందుకు బహూకరించకూడదు?

నేనామెకెంతయినా చేయెచ్చు
నేనామెకెన్నయినా కొనివ్వచ్చు
నా యిచ్చవచ్చినన్ని బహుమానాల్తో
ఆమె నలంకరించవచ్చు కానీ, ఆమెకి కించిత్తు
అసంతృప్తి కలిగిస్తానేమో -
కూరలో కాస్తంత ఉప్పు ఎక్కువయినట్టు -
ఆమె ఏమన్నా అసంతృప్తి పడితే
అది నాకు హృదయశల్యం -
అందుకే ఆమె దగ్గరకి పరుగెత్తా -

అలసిన చూపులతో
వృద్ధపల్లకిలా గోడలో కలిసిపోయి,
అరవై డెబ్భయిమంది ముసలాళ్ళ మధ్య మా అమ్మ కూర్చోనుంది
ఆమె ఆకారం చెదిరినట్టు కనిపించింది.

ఆమె పాదాల కింద మట్టిని
నుదుటితో తాకుతూ సాష్టాంగదండ ప్రణామం చేసి
అడిగా 'అమ్మా! నీకేం కావాలో కోరుకో' అని
ఒకడు టెలిస్కోపుగుండా నక్షత్ర మండలాన్ని వీక్షించినట్టు
కనులు చిట్లించి నావంక చూస్తూ అంది
'చెంపలకి పైన, చెంపల దగ్గర
ఆ తెల్లటి పూలేవిటిరా?
ఆరిదేవుడా! కాస్త నల్లరంగు కొనుక్కొని
వేసుకోరా తండ్రీ!'

సతతం నాగుంచి ఆలోచించే
ఆరాటపడే గొప్ప హృదయముంది ఆమెకి
శాశ్వతంగా ఆమె నాకిచ్చే
గొప్ప బహుమతి ముందు
నేనిద్దామనుకున్న బహుమతులన్నీ
ముక్కచెక్కలయిపోయాయి!

Sunday, April 10, 2011

Drift Away


మొన్న శుక్రవారం రాత్రి మిత్రులతో బౌలింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ పాట విన్నాను. అప్పట్నుంచి వెంటాడుతూనే వుంది. YouTubeలో చాలా రెండరేషన్స్ కనిపించాయి. అన్నింటిలో ఆ సాహిత్యానికి డోబి బాణీనే పూర్తి న్యాయం చేసినట్టు అనిపించింది. ఆ పాటకి స్వేచ్చాను వాదం, ఇంగ్లీష్ మాతృక కింది వున్నాయి.







రోజు రోజుకి నా గందరగోళం హెచ్చుతోంది
అయినా, తెరిపిలేని ఈ వర్షంలోంచి
వెలుగు కోసమే నా వెతుకులాట
మీకు తెలుసు అది నేను ఓడిపోవడానికి యిష్టపడని ఆటని
కానీ యిందులో నాకు ప్రయాస తెలుస్తోంది
అది సిగ్గు పడాల్సిన సంగతి కాదూ?

పిల్లలూ నాకా పాటనివ్వండి, నా ఆత్మని విడిపించండి
మీ రాక్ అండ్ రోల్ లో కనపడకుండా కరిగిపోయి
దూరంగా కొట్టుకుపోవాలనుంది.

నా సమయం వృధా చేస్తున్నానన్న భావన మొదలైంది
నేను చేస్తున్న పనులు నాకు అర్ధంమవడం లేదు
బైట ప్రపంచం చాలా నిర్దయగా కనిపిస్తోంది
నన్ను ఎత్తి తీసుకుపోవడానికి
యిప్పుడు మిమ్మల్నే నమ్మకుంటున్నాను

పిల్లలూ నాకా పాటనివ్వండి, నా ఆత్మని విడిపించండి
మీ రాక్ అండ్ రోల్ లో కనపడకుండా కరిగిపోయి
దూరంగా కొట్టుకుపోవాలనుంది

నా మనసు స్వేచ్ఛగా వున్నప్పుడు
ఒక మధురగీతి నన్ను కదిలించగలదని మీకు తెలుసు
అలాగే దానికి ముసురుపట్టి నప్పుడు
నన్ను సేదదీర్చడానికి గిటారు వస్తూవుంటుంది

మీరు నాకు కలగజేస్తున్న సంతోషానికి థాంక్స్
మీ లయా ప్రాసా వాటి పొందిక
మీ పాట
నేను నమ్ముతానని మీరు తెలుసుకోవాలని నాకోరిక
మీరు వెంటవుండి సాయం చేసారు
నన్ను ధృఢం చేశారు

పిల్లలూ నాకా పాటనివ్వండి, నా ఆత్మని విడిపించండి
మీ రాక్ అండ్ రోల్ లో కనపడకుండా కరిగిపోయి
దూరంగా కొట్టుకుపోవాలనుంది

***
English original by Mentor Williams

Day after day I'm more confused
Yet I look for the light
Through the pourin' rain
You know that's a game that I hate to lose
And I'm feeling the strain
Ain't it a shame

Oh, give me the beat, boys, and free my soul
I want to get lost in your rock and roll
And drift away
[repeat]

Beginning to think that I'm wasting time
I don't understand the things I do
The world outside looks so unkind
Now I'm counting on you
To carry me through

Oh, give me the beat, boys, and free my soul
I want to get lost in your rock and roll
And drift away
[repeat]

And when my mind is free
You know a melody can move me
And when I'm feeling blue
The guitar's coming through to soothe me

Thanks for the joy that you're given me
I want you to know I believe in your song
Your rythm and rhyme and harmony
You've helped me along
Makin' me strong

Oh, give me the beat, boys, and free my soul
I want to get lost in your rock and roll
And drift away
[repeat]
Na, na, now won't ya
Won't ya take, oh ha ..take me

Monday, March 28, 2011

Wednesday, March 2, 2011

రాం గోపాల వర్మకి జేజేలు!

నేను ఆయన అభిమానిని కాదు. శివ, క్షణక్షణం, రంగీలా తరువాత రణ్, రక్తచరిత్ర 1 మినహా ఆయన యితర సినిమాలు నేను చూడలేదు. అందరూ అంతగా మెచ్చుకున్న ఆయన సినిమాలు - కంపెనీ, సత్యా - కూడా చూడలేదు. ఆయన చూసి, పరవశించి అందర్నీ చూడమని చెప్పిన 'అవతార్' కూడా చూడలేదు. ఆయన తెలంగాణ రాష్ర ఉద్యమ నేపథ్యంలో తన బ్లాగ్ లోనూ, తరువాత ఆంధ్రజ్యోతి లోను లగడపాటి రాజగోపాల్ని సమర్ధిస్తున్నట్లు వ్రాసిన వ్యాసాన్ని చూసి ఆయన్ని - నావికుల భాషలో - తిట్టుకున్నాను కూడా.

ఎంతో కొంత సృజనాత్మకత ఉండి, సినిమా రూపం పట్ల అవగాహన వున్న దక్షణ భారత దర్శకులు మెదట తెలుగు/తమిళ్, తరువాతి మెట్టు హిందీ, ఆ తరువాత హాలీవుడ్డో లేక ఆస్కారో అని వెంపర్లాడుతూ వెగటు పుట్టిస్తున్న వేషాలు వేస్తున్న రోజుల్లో, ఆ సూడో మేధావుల వేష భాషల్ని అనుసరించక, ఆ స్పృహే లేనట్లు, ఒక పేట రౌడి వేషంలో తిరుగుతూ, బతుకుతూ, సినిమాలు తీస్తూ, మర్యాదస్తుడిగా గుర్తించబడడానికి నిరాకరిస్తున్న రాం గోపాల్ వర్మ, గెలిచినా ఓడినా ఒక యోధుడి - హీరో - వలె నాకు గోచరిస్తున్నారు.

'నా ఇష్టం' కొద్ది సినిమాలు తీస్తాను అంటున్నాడంటే అతనికి ప్రేక్షకుల మీద ఎంత గౌరవం, నమ్మకం వుండి వుండాలి? ఒక సృష్టికర్త నా యిష్టం ఇలాగే చేస్తాను అన్నారంటే, నన్ను ఆదరించగలిగే ప్రేక్షకులు / శ్రోతలు ఈ కాలంలో, ఈ దేశంలో వుండే వుంటారు. వాళ్ళు వస్తారు. చూస్తారు. వాళ్ళకోసమే నేను రోజు నిద్రలేచి పనిచేసేది అంటున్నారని నాకు వినిపిస్తుంది. అటువంటి ఉన్మాదమే, ఆధారంలేని నమ్మకమే వారిచేత ప్రయోగాలు చేయిస్తుంది. రిస్క్ తీసుకునేలా చేయిస్తుంది. ఈ సందర్భంలో అసందర్భంగా నేను ఆరాధించే తెలుగు సినిమా దర్ళకుడు బి.ఎన్. రెడ్డి నాకు జ్ఞాపకం వస్తారు. ఆయన నాయిష్టం అనుకుని తీసిన సినిమాలు 'బంగారుపాప', 'మల్లీశ్వరి' వంటివి ఈరోజుకి చూసి, పరవశించే ప్రేక్షకులు వున్నారు. కానీ ఆయన బాక్సాఫీస్ విజయం కోసం ఒత్తిడులకో ప్రలోభాలకో లొంగి తీసిన 'రాజమకుటం' అప్పుడూ ఇప్పడూ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

కూడికలు తీసివేతలు తప్ప మతిలేని ఈ ప్రపంచంలో మన అదృష్టం కొద్ది మిగిలిన కొద్ది మంది మతిలేని వ్యక్తులవలే కనిపిస్తున్నారు రాం గోంపాలవర్మ. అటువంటి వ్యక్తులు love me or leave me అని తప్ప మరో ఎంపిక మనకి మిగల్చరు. వాళ్ళని ignore చేయడం చాలాకష్టం. ప్రేమించగలగడం దాదాపు అసాధ్యం.

Now, I choose to - try to - love RGV.




Monday, January 31, 2011

Passed PPA certification Exam !


I got the mail I had been eagerly waiting for since last two weeks.

I took the PPA certification test on Jan 6th at Orlando. Barbara London's book and Sandy Puc's forums were valuable resources for the test preparation.

I am so glad I took the test. Now, I am ready for the image submission.

Thursday, January 27, 2011

A model at Jax Tamil association Pongal celebration



Canon 60D, 70-200 2.8 IS @ 200
ISO 1600, f 2.8 1/200