Sunday, November 2, 2008

Halloween 08

Rooster and her pumpkins.
Mousy and her friends.
Mousy coming back after collecting all the candy.

Painting the pumpkin.

With sparklers on Deepavali.
Sparklers and friends.Monday, September 29, 2008

గాంధీ పుట్టిన రోజు

ఈమధ్యే మిత్రుడు వంశీ హిందులో అచ్చయిన ‘Give Buddihst economics a try’ అనే వ్యాసం చదవమని పంపిచాడు. ఆ వ్యాసం రాసింది బోస్టన్లో సఫోల్క్ యూనివర్సిటీలో పనిచేసే ఆచార్య సి. గోపినాధ్. ఆధునిక అర్ధశాస్త్రంలో, వస్తు వినిమయమే సంతోష జీవితానికి సోపానం అన్న రీతిలో జరుగుతున్న వాదనలకి ప్రతిగా వినిమయ విలువలకన్నా భిన్నమైన విలువలని కనుగొనవలసిన అవసరం వుందని, అలాంటి ప్రత్నామ్నాయం బౌద్ధంలోనో ఇంకో తత్వశాస్త్రంలోనో వుంటే దానికి ఒక అవకాశం యివ్వాలనే అభిప్రాయం ఆ వ్యాసకర్త వ్యక్తంచేశారు. ‘ధర్మ’ వ్యతిరేకంకాని మార్కెట్లని సూచించేలా ‘ధర్మ ఇండెక్స్’ని త్వరలో డౌజోన్స్ ఇండక్స్ లో చేర్చబోతున్నారనీ ఆయన తెలిపారు.

ఈవాళ మనకి నగరాల్లో అభివృద్ధిపేరుతో దిగుమతి అవుతున్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లు, ఐ-మేక్స్ లు, కారులు, పబ్ లు, స్టార్ హోటలాంటి కార్పరేట్ హాస్పటళ్ళు, ఆడంబరాలు అవసరాలయిపోతున్న మన జీవన విధానాలు ఇన్ని గందరగోళాల మధ్య మనం గాంధి పుట్టనరోజుని అర్ధవంతంగా జరుపుకోగలుగుతామా?

నేను అమెరికావెళ్ళిన కొత్తల్లో – 2002లో – ఒకసారి కొంతమంది సహోద్యోగులు, వి.పి.తో కలసి లంచ్ కి వెళ్ళినప్పుడు ఆయన గాంధీ ప్రస్తావనతెచ్చారు. నాతో వున్న యింకో భారతీయురాలు గాంధీపేరు వినగానే కోపంతో ‘ఆయన వల్లే మాదేశం యింత అధ్వాన్నంగా అయింది. ఒక చెంపమీద కొడితే యింకో చెంప చూపించమనడం అంత మూర్ఖత్వం యింకోటి లేదు’ అంది. ఆ తరవాత చర్చ ఎలా జరిగిందో నాకు సరిగ్గాగుర్తులేదు కానీ నేను అన్నది, స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాల అనంతరంకూడా, అనేక రకాల జాతులు, భాషలు, విభేదాలు వున్న భారతదేశంలాంటి – దాదాపు ఖండం అనదగినంత – పెద్ద దేశం యింకా ముక్కలు కాకుండా ఒకేదేశంగా మిగిలివుందంటే ఆ ఖ్యాతి గాంధీదే అని. మిగతా దేశాల్లో జరిగిన హింసాయుతమైన జాతీయ వుద్యమాలు, సఫలం అయ్యాకా ఆ ఆయుధాలన్ని ఏమయ్యాయి? ఆయా దేశాలలో రక్తశిక్తమైన అంతర్గత పోరాటాలకి ఆ ఆయుధాలే ఉపయోగపడ్డాయి.

తొభైల్లో రష్యా అఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించింది, వాళ్ళతో యుద్ధం చేయడానికి ఆఫ్ఘన్లకి అమెరికా, యింకా కొన్నిదేశాలు ఆయుధాలు సరఫరాచేసాయి. రష్యాని యుద్ధంలో ఓడించారు. ఆ యద్ధంలో వాడిన ఆయుధాలూ, వాడగా మిగిలిన మందుగుండూ, ఆ యుద్ధాలకోసం అమెరికా ఆఫ్ఘన్లకి యిచ్చిన శిక్షణా, రష్యా ఓటమి తరువాత ఏమయ్యాయి? ఆఫ్ఘన్లు వాటిని ఎవరిమీద ఎందుకు వాడారో అందరకీ తెలిసిన విషయమే.

గాంధీ భారత స్వాతంత్ర పోరాటంలోకి వచ్చింది బ్రిటిష్ వాళ్ళమీద ద్వేషంతొ కాదు, ఆయన మనదేశంలో వున్న అశుభ్రతా, అవిద్య, ఆకలి, రోగాలు, అంటరానితనం మొదమైనవి మనదేశ ప్రగతికి - బ్రిటిష్ వారికంటే - తీవ్రమైన ప్రతికూల అంశాలుగా పరిగణించాడు. 1931లో గాంధీకీ వైస్రాయ్ ఇర్విన్ కి మధ్య చర్చలు జరిగి ఒప్పందం జరిగినప్పుడే భారతదేశానికి స్వతంత్ర్వం రావడం - ఖచ్చితమైన తారీఖు తెలియదు కానీ ఆ రోజు త్వరలోనే రావడం - ఖాయం అన్న సంగతి గాంధీకి స్పష్టంగానే తెలుసు. అందుకే ఆయన పోరాటం / కృషి అంతా అసలైన విషయాలని ఆయన భావించిన వాటిమీద – దళిత సంస్కరణ, హిందూ ముస్లింల సఖ్యత, సత్యాగ్రహం గురించిన ప్రచారం, ఆరోగ్యకరమైన, ఆడంబరాలు లేని జీవన వైఖరి మీద ఆసక్తి కలిగించడం వంటి విషయాల మీద జరిగింది.

స్వాతంత్రం తరవాత భారత ఆర్దికరంగం మీద గాంధీ ప్రభావం చాలా తక్కువ. ఆయన Buddihst economicsకి ఒక అవకాశం యిచ్చేవాడో లేదోకానీ, మన షాపింగ్ కాంప్లెక్స్ లు, మురికివాడలు, బాంబు పేలుళ్ళు, పబ్ లు, కారులు చూసి ఏమాత్రం గర్వపడేవాడు కాదు. బహుశా, మన అవివేకతకి నిరసనగా, మూడు వారాలు నిరాహారదీక్షకి, ప్రార్ధనకి పిలుపు యిచ్చేవాడేమో.- రమణ

2 అక్టోబరు 2008


***

Tuesday, September 16, 2008

అరవైల కోసం కండలు

అపర్ణా, మా అమ్మయి రెండునెల్లగా వూళ్ళో లేక రోజూ ఒక కొత్త తెలుగు సినిమా చప్పున, ఈ రెండు నెలల్లో దాదాపు ఓ ఏభై తెలుగు సినిమాలు చూసివుంటాను. చాలా ఏళ్ళు చూడకుండా తప్పించుకున్న హాస్యం పేరుమీద చెలమణీ అయ్యే అపహాస్యాలు, పాటల ముసుగులో సాఫ్ట్ పోర్న్, చూసి తరించాను. ఎక్కువ సినిమాల్లో కనిపించే ఒక దృశ్యం - బ్రహ్మానందం జిమ్ లో కసరత్తు చేస్తూ వుంటాడు. అతని చుట్టూ అతనిలాగే వికారంగా (లావుగా అనే అర్ధంలో) వున్న కొందరు వుంటారు. వాళ్ళు రకరకాల యంత్రాలతో మహా కసరత్తు చేస్తున్నట్టు నటిస్తుంటారు. బాగా సిగరట్లు కాలుస్తు, తాగుతూ తిరిగే హిరో అతని భుజం మీద చేయి వేసేసరికే బ్రహ్మానందం తట్టుకోలేక కుయ్యొమొర్ఱో అంటూ వుంటాడు. అది చూసి మనం నవ్వాలి. ఇందులో ఎలాంటి అర్ధాలు రావచ్చూ? ఎంత కసరత్తు చేసినా కుర్ఱ వాళ్ళ బలం పెద్ద వాళ్ళకి రాదనా? హీరోల బలం కామెడియన్లకి రాదనా? బలం ‘రక్తం’ వల్ల వస్తుంది కానీ సాధనతో కాదన?

అమెరికాలో శరీర సౌష్టవం (Physical fitness) పరిశ్రమ బిలియన్ డాలర్లు పైగా విలువ చేసే పరిశ్రమ. పూర్వం మద్రాసులో వీధికి ఒక గుడి, బాగా డబ్బు చేసిన వాళ్ళ యింటికీ కూడా ఒక గుడీ వుండేవి. అలాగే అమెరికాలో ప్రతి చిన్న టౌన్ లోనూ, వీధికి ఒకటి కన్నా ఎక్కువే జిమ్ లు, హెల్త్ క్లబ్ లు కనిపిస్తాయి. చాలా కార్పరేట్ కంపెనీలు వాటి ప్రంగణంలోనే ఫలహారశాలతో పాటు వ్యాయామశాల కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ బిలియన్ డాలర్ల పరిశ్రమకి జరిగే మిలియన్ల డాలర్ల ప్రచారం, దానికితోడు ప్రధానస్రవంతి మాధ్యమాలలో అంతర్లీనంగా జరిగే ప్రచారం – ఉదాహరణకి షారుక్ ఖాన్ “ఓం శాంతి ఓం”, కరీనాకపూర్ సైజ్ జీరో కథలు – జిమ్ లో చేరడం పట్ల వ్యామోహాన్ని కలిగించడంలో మంచి ఫలితాలే సాధిస్తున్నాయి. ఈ మధ్య ఒకామె అంటుంటే విన్నాను, ఆడవాళ్ళ జీన్స్ డిజైన్ చేసే డిజైనర్లు దాదాపు అందరూ లోరైజ్ (బొడ్డుకి చాలాకింద నుంచే వుండే) జీన్స్ మాత్రమే డిజైన్ చేస్తున్నారుట, అవి సన్న నడుంవున్న ఆడవాళ్ళకే నప్పుతాయి. ఆమె దీన్ని ఒక కుట్రగా వర్ణించింది.

కసరత్తు అవసరమా లేదా అన్న విషయమై చాలా పరిశోధనలే జరిగాయి. క్రమం తప్పకుండా శారీరకమైన శ్రమ / వ్యాయామం చేయడం వల్ల దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలే వుంటాయన్నది అందరూ ఒప్పుకున్న విషయమే. అయితే కసరత్తు సిక్స్ పేక్ కోసమో, సైజ్ జీరోకోసమో మాత్రమే అయితే, అది ఎంతవరకూ సాధ్యమనే విషయం పక్కన వుంచి, దాని ప్రయోజనంకూడా చాలా పరిమితం. వ్యాయామం గురించి జరిగే ప్రచారం చాలా వరకూ రూపం (shape) గురించి వుంటోంది. కాబట్టి రూపం విషయమై పెద్ద అసక్తి లేనివాళ్ళలో చాలామందికి వ్యాయామం కావాలంటే రోజు నడిస్తేనో, మెట్లు ఎక్కుతూ, మాములు రోజు వారిగా చేసే పనులు చేస్తేనో చాలనే అభిప్రాయం వుంది. అవన్నీ వ్యాయామమే, కానీ, అది సరిపోదు. మనకి యిష్టం వున్నలేకపోయినా, మనలో చాలామంది ఎనభఏళ్ళు దాటేవరకూ బతికే అవకాశం చాలా ఎక్కువ. అలాంటప్పుడు రిటైర్మెంట్ కోసం డబ్బులు దాచుకోవడం ఎంత అవసరమో, చురుగ్గా తిరగడానికి అవసరమైన కీళ్ళు, కాళ్ళు, చేతులు, బలం కూడబెట్టుకోవడం కూడా అంతే అవసరం.

వయసు పెరగడంలో భాగంగా శారీరకంగా ఒచ్చే ఒక మార్పు, కండ కరిగిపోవడం. తగినంత బరువులు ఎత్తడం (weights), నిరోధన శిక్షణ (resistence training), కండరాలని సాగదీసే శిక్షణ చేయడం ద్వారా, కండ కరగడం, కీళ్ళు వెసులుబాటు కోల్పోవడం వంటివి కొంత వరకూ నిరోధించవచ్చు. అందుకే యిప్పడు జిమ్ లో ఎంత బరువు ఎత్తగలరు, ఎంత వేగంగా పరిగెత్తగలరు, అలా పరుగుపెడుతున్నప్పడు గుండె ఎలాకొట్టుకుంటోంది అనేవాటిని బట్టి వయసుతో పాటూ, ‘శరీరం వయసు’ అని యింకో లెఖ్ఖ చలామణీలోకి వచ్చింది. మీ వయసు 65 అయినా శక్తిని, చురుకుని బట్టి మీ శరీరక వయసు 45 కావచ్చు. ఏభైల్లో వుండి, మొహం 50 లాగా కనబడుతూనే ముఫ్పైల్లో వున్న నాకన్న పది రెట్లు ఎక్కువ బరువులు ఎత్తేవాళ్ళని, చొక్కాలు తీసేస్తే అరవైల ముఖాలకి నలభైల శరీరలు వున్నట్టు వున్న వాళ్ళని చాలామందినే నేను YMCAలో చూసాను.

నడవడం, పరిగెత్తడం, ఆటలు ఆడడం లాంటివి హృదయానికి సంబంధించిన వ్యాయామాలు – శ్వాశక్రియ శిక్షణకి అవి అవసరం. సన్నటి ఆరోగ్యకరమైన కండ ఏర్పడడానికి బరువులు ఎత్తడం ఒకటే దారి. బరువులు ఎత్తడం అనగానే మనకి కరణం మల్లీశ్వరే గుర్తుకు వస్తే అది మన తప్పుకాదు. కానీ బరువుతో వ్యాయామం చేయడం అంటే ఆమె లాగా బరువులు ఎత్తడం మాత్రమే కాదు. చాలా రకాల యంత్రాలు ఒకొ్క్క కండరసమూహానికి దానికి మాత్రమే శిక్షణ యిచ్చేలాగా సహాయపడేవి చాలావున్నాయి. ఏవయసు వాళ్ళైనా గాయాల భయం లేకుండా శిక్షణ ప్రారంభించవచ్చు. బ్రహ్మానందం వ్యాయామం చేస్తున్నట్టు నటించడం కాకుండా నిజంగా చేస్తే ఈ సారి ఆదెబ్బ, కొట్టిన హీరోకే తగలచ్చు.

కలం తాజా : YMCAలో చేరిన కొత్తల్లో అక్కడ స్నానం చేయడానికి చాలా సిగ్గుగా వుండేది. చొక్కావిప్పి, బొజ్జకనబడకుండా ఊపిరి బిగబట్టి కష్టపడి నడుస్తుంటే అక్కడ ముళ్ళపూడి వెంకటరమణగారు చెప్పిన ఆరున్నర అడుగుల పొడుగు ఎకరన్నర ఛాతీ వున్న సోదరులు నగ్నంగా – వాళ్ళ పడగ్గదుల్లో తిరిగినంత ధీమాగ – తిరుగుతుంటే, ‘ఔరా, ఎందుకు నాకీ దురవస్థా’ అనిపించేది. అపర్ణతో చెబితే అటు ఆడవాళ్ళ లాకర్ రూముల్లో అయితే వాళ్ళు ‘మేకప్ వేసుకున్నాకే బట్టలు తొడుక్కోడానికి వెళ్తున్నార’ని చెప్పింది. ‘నువ్విటు నేనటు వెళ్తే సంతోషించే వాళ్ళమేమో’ అన్నాను.

(Note: Photos are from Microsoft royalty free clip art collection)

Friday, August 15, 2008

వరంగల్‌ యాత్ర


ఈమారు సెలవలకి ఇండియా వెళ్ళినప్పుడు ఖచ్చితంగ ఒక రెండు ప్రాంతాలు చూడాలనుకున్నాను. అందులో ఒకటి మెదక్‌ జిల్లా సిద్దిపేట - కె.సి.ఆర్‌. సొంత ఊళ్ళో ఆయన మీద నిజంగా ఎంత అభిమానం ఉందో చూడ్డానికీ, ఇంకోటి వరంగల్‌లో కాకతీయుల కీర్తితోరణాలు. సిద్దిపేట వెళ్ళడం కుదర్లేదు కానీ, ఎలక్షన్‌ ఫలితాలు చూసాకా ఆయన నియోజకవర్గం ప్రజలు యిచ్చిన తీర్పు స్పష్టంగానే వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పింది. వరంగల్‌ ప్రయాణం మాత్రం చేయగలిగాను.

మే 30 శనివారం తెల్లారి 5 గంటలకి బయలుదేరడానికని డ్రైవర్‌ని మాట్లాడుకున్నాం. 'ఐదుగంటలకి రాగలవాయ్యా' అంటే అతను 'ఓ పావుగంట ముందే వచ్చేస్తాను సార్‌' అన్నాడు. ఫోటోలు తీయడానికి మధ్యాహ్నం ఎండ పనికిరాదు. పొద్దున్న, సాయంత్రాలు ఏటవాలుగా సూర్యకిరణాలు పడే ఎండలోనే ఫోటోలు బాగుంటాయి. ఐదు గంటలకి బయలుదేరి 8 గంటలకైనా చేరితే, పొద్దన్న వేయిస్తంభాలగుడి చూసుకుని, సాయంత్రం కోట దగ్గర వుండాలనీ మధ్యలో వీలయితే రామప్పగుడికి వెళ్ళి వద్దామని అనుకున్నాం. ఐదు గంటలకి వస్తానన్న డ్రైవరు ఏడింటికికాని రాలేదు. వేయిస్తంభాల గుడి చేరేప్పటికే 11 అయింది.

గుడి చాలా అంద్భుతంగా వుంది, కానీ, నే ఊహించింది వేరే (వర్షం సినిమా చూడలేదు లెండి, తెలుగు సినిమాలంటే కొంచెం భయం) వేయిస్తంభాలంటే చాలా పెద్ద నిర్మాణం అయివుంటుందనుకున్నా. బయట కనిపించే గోడలోనే స్తంభాలని లెక్కపెట్టాలని చెప్పారు. గుడిలోపల శివుడు, విష్ణువు, సూర్యదేవుడు మూర్తులు వున్నాయి. ఈరోజుకి గుళ్ళో దీప ధూప నైవేద్యాలు, పూజలు జరుగుతూనే వున్నాయి. శనివారం మిట్టమధ్యాహ్నం పూట కూడ మనుషులు లేకుండా వుండేలా ఫోటో తీయడం సాధ్యంకాలేదు - అంత జనం.

గుడి లోపల నాలుగు పెద్ద నల్ల గ్రానైట్‌(?) స్తంభాలు వున్నాయి. వాటిమీద చాలా అందమైన నగషీలు చెక్కారు. గుడి కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఎంతమంది పనిచేసారోలాంటి రికార్డులు లేవుకాని, బహుశా కొన్ని వందల మంది సంవత్సరాల కష్టం అయివుండచ్చు. అది కట్టినవాళ్ళు, యిన్ని వందల సంవత్సరాల తరువాత కూడ ప్రజలు వీటిని చూసి ఆనందిస్తారని ఊహించి వుంటారోలేదో కానీ, వాళ్ళ శ్రద్ధ, సౌందర్య దృష్టి గుడిలో మనకి అడుగడుగునా కనపడతాయి.

ఎక్కడైనా తెలుగు శిలాశాసనాలు కనిపిస్తాయా అనిచూస్తుంటే యిది కనబడింది. ఏవో నాలుగైదు అక్షరాలు తప్పించి మిగతావి ఏమిటనే తెలియడం లేదు. అప్పటికే తెలుగు, కన్నడ భాషాల లిపి విడిపోయి వుండాలి, అయినా ఈ లిపి ఆధునిక తెలుగు లిపికి పోలికే లేదు. మీకు గడచిని శతాబ్దాల్లో తెలుగు లిపి పరిణామం గురించి ఆశక్తి వుంటే, వివరాలు యిక్కడ చూడగలరు.


గుడినించి దుర్గానికి పెద్ద దూరంలేదు - పదికిలో మీటర్లని జ్ఞాపకం.


ఊరునిండా దారి సూచించే బోర్డులు వున్నాయి. కొత్తవాళ్ళు వెళ్ళినా దారి కనుక్కోడానికి ఏమీ యిబ్బంది పడక్కర్లేదు. కోట ద్వారంలోప ప్రవేశించిన తరువాత రోడ్డు పాముమెలికలు తిరుగుతుంది. లోపల అన్నీ ప్రజలు నివాసంవుంటున్న యిళ్ళు. మధ్యలో కొన్ని చోట్లు పిల్లలు క్రికెట్టు ఆడుకునే చోట్లుగా వాడుతున్నారు.
నాలుగువైపులా గర్వంగ నిలుచున్న కీర్తి తోరణాలు తప్ప మిగతావన్ని నేలమీదే వున్నాయి. నేలమీద వున్న స్తంభాల శకలాల్లో చాలా అద్భుతమైన శిల్ప ప్రావీణ్యత కనబడుతుంది. కొన్నిటి మీద యుద్ధానికి వెళుతున్న సేనని చెక్కారు - ఏనుగులు, కాల్బలం వాటిమీద చూడొచ్చు. ఇంకొన్ని స్తంభాలమీద నర్తకులు యిలా. వాటిని పరిశీలించడం వాల్ల ఆనాటి సాంఘిక జీవనం తాలుకు కొన్ని చిహ్నాలని తెలుసుకోవచ్చు. అయితే మనకి మన గతవైభవ చిహ్నాల పట్ల వున్న ఉదాశీనత వల్ల, దీన్ని ఒక పార్కులాగా పరిగణిస్తున్నాం. బంతి ఆట ఆడడం, పిల్లల్ని అక్కడ వున్న ఏనుగుల శిల్పాల నీద కూర్చోపెట్టడం, అక్కడే తినడం, వుమ్మడం, యిది మన జాతి సంపదమీద మన వైఖరి.

అంతకన్నా హాస్యాస్పదమైన విషయం, నాతో వచ్చిన మా మామయ్య అక్కడ పనిచేసే ఏ.ఎస్‌.ఐ అధికారిని టాయిలెట్స్‌ ఎక్కడ వున్నాయని అడిగితే, అతను కొంచెం దూరంలో వున్న వాటిని చూపించి 'ఒకటికే ఐతే, అంతదూరం వెళ్ళక్కర్లేదు లెండి' అన్నాడు. ఒక బాధ్యత గల అధికారి అలా అన్నప్పుడు, ఇంకా ఏనుగుల మీద పిల్లల్ని కూర్చో పెట్టె తల్లితండ్రుల మీద కోపం తెచ్చుకుంటే ఏం ప్రయోజనం?

కొంచెం డబ్బులు, ఉత్సాహం వున్న సంస్థ చేతికి కోటని నిర్వహించే అధికారం యిచ్చి, సాధ్యం అయినంత వరకు బాగుజేసి, ఆ కాలపు దుస్తులు తొడుక్కున్న కొంత మంది వాలంటీర్లని రోజు కొంచెం సేపు కోటలో వుండేట్టు చేసి, వాళ్ళ చేత చిన్న చిన్న ఉపన్యాసాలు యిప్పించడం, లేద అప్పటి తెలుగు కవిత్వం చదివించడం చేస్తే ఎలావుంటుంది చెప్పండి? అప్పుడు వరంగల్‌ కోటని దర్శించడం మన జాతి చరిత్రని తెలుసుకోవడంలో ఒక పాఠంలా వుండదూ?


రామప్పగుడి కోటనుంచి డభ్భైకిలోమిటర్లదూరంలో వుంది.


దాదాపు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం హైవేమీదే. మిగతాదాంత మట్టి రోడ్డు. గుడి ఏజన్సీ ఏరియాలో వుంది. దారిలొ ఒకటి రెండు పోలీసు చెక్‌ పాయింట్స్‌ వున్నాయి. దారిలో మనకి గ్రామీణ భారతం కొంత తళుక్కుమని కనిపిస్తుంది - గడ్డిమోపులు మోసుకుని వెళ్తున్న ఎడ్లబండ్లు, మ్యూజియంలలోంచి తెచ్చారా అనిపించేలాంటి సైకిళ్ళు తొక్కుతూ కనిపించే బక్కచిక్కిన మనుషులు, చెట్లకింద కూర్చుని చుట్టలు కాల్చుకుంటూ కనబడే వాళ్ళు, యిళ్ళ బయట అంట్లుతోముకునే ఆడవాళ్ళు, నులక మంచాల మీద కూర్చున్న ముసలాళ్ళు, వాటి చుట్టు పరిగెత్తే కోళ్ళు.. ఆహ్లాదంగా అనిపిస్తాయి - ముఖ్యంగా మనం ప్రయాణం చేస్తున్న కారు మనది కానప్పుడు.

ఈ గుళ్ళో చాలా అద్భుతమైన శిల్పాలు వున్నాయి. రామప్ప అనే శిల్పి దీన్ని కట్టాడని ప్రశస్తి. నల్ల రాయి మీద చెక్కిన రంభ, నాగిని శిల్పాలు చాలా హృద్యంగా వుంటాయి. వేసవి కాలం సాయంత్రం నాలుగు ప్రాంతాలకి యిక్కడ ఎండ కొంచెం ఏటవాలుగా మారుతుంది, ఆసమయం ఫోటోలో తీయడానికి అనువైన కాలం. నేను ట్రైపాడ్‌ తీసుకెళ్ళలేదు కానీ, యిక్కడ ట్రైపడ్‌ వాడడానికి కానీ, ఫ్లాష్‌ వాడడానికి కాని ఎవరు అభ్యంతరం పెట్టెవాళ్ళు లేరు. సమయం లేక వెనక్కి వచ్చేసాం. ఈ సారి వెళ్ళినప్పుడు కనీసం ఒక రాత్రి అక్కడే వుండేలా ఏర్పాటు చేసుకుని వెళ్ళాలి.
***

Thursday, June 19, 2008

Warangal

I wanted to go to Warangal and Siddipet in this trip. Siddipet to see a public meeting of the man I hate – KCR - and to Warangal to see ‘Kakatiyula keerthi toranalu’. I could not go to Siddipet but made it to Warangal, along with my uncle.

We borrowed a car - new Maruthi swift – and hired a driver. The driver promised to come at 5:30 but came at 7 am. We wanted to reach the 1000 pillar temple before noon but end up reaching there around 11.

The temple is very impressive, but not what I expected. It was not as huge as I imagined it. It seems there are 1000 pillars but there is only a very tiny gap between each pillar. In other words, the walls we see are made up of those pillars.Inside the temple, we can see four huge black granite pillars with wonderful carvings. Temple has shrines of Siva, Vishnu and Surya. The gods are still worshiped in the temple. Even on a Saturday afternoon, it was impossible for me to get a picture without people in the frame.

Kakatiya kings were Telugu kings, the script on the stones, do not look like modern Telugu, and it looks like some characters are of another Dravidian language.Another impressive monument of Kakatiyas is their fort – actually ruins of the fort.

The entrance of the fort has a very huge door and the road goes in a zig zag fashion for the next 4 km. There are several houses inside the fort walls and it is thickly populated area. Some places inside the fort walls are used as playgrounds by local kids. On one of the boards in Telugu the name ‘Venis’ city is written as ‘Venin’ city. My uncle observed that typo and brought to the attention of the ASI officer there, who first did not see where that type was and after seeing, he corrected it immediately and said, “Yes, I noticed it yesterday and wanted to fix”.

Except the ‘keerthi thoranaalu’ on four sides, every other pillar is on the floor. We can see wonderful artwork on the many pillars. On some, they sculpt the army that was going for war; we can see several elephants, soldiers holding swards etc. On some pillars, it is the dancers in various Bhangimas. By observing, the artwork on the pillars we can learn a lot about the period’s social life. However, due to our utter disregard for our past treasures, this place is being treated like a park, where people come and play ball games; make their kids sit on the sculptures, eat, spit and do much more.

The funniest thing was this, my uncle asked the ASI employee about the location of urinals. The employee pointed to a place several 100 feet away and said, “If it is for men, they need not go that far too…”. I thought, if an employee of the Archeological Society of India is saying that, what is the point in me being upset about the thoughtless parent who is making their kids sit on the elephant sculptures there.

If I have the power and money, I would like to see this place renovated and maintained with people in period costumes, similar to how Americans maintain their historical sites.

Then a trip to this site would serve as a crash course for the history of Telugu nation.

Ramappa temple is located 70 KM from the fort.

The drive up to the 40 KM from Warangal is on a proper road, after that it is just a mud road. The temple is located in the agency area of Eturi Naagaaram. There are few police check posts on the way.We can get a glimpse of the life of rural India on the way; the bullock carts carrying grass and paddy. Green open fields, people riding bicycle on the road, people sitting under banyan tree with cigars in their mouths, old men sitting on the cots in front of the house, groups of woman sitting in front of the house talking, washing dishes, chicken and goats running around the huts etc. It is a pleasent ride – particularly if you are not the owner of the car.
Ramappa temple has very impressive artwork; particularly the idols of Nagini, Rambha on the black stone on the walls are done with wonderful taste. By 4 pm the light from the west side – back end of the – temple becomes angular creating impressive shadows.Due to time constraints we could not stay there for long, ideally one should spend a night nearby and visit the temple in the early hours and late hours to record the true beauty of the construction. Next time I plan to do that.

This is the side view of the temple -

The original sasanam - thou the language used is the Telugu, the script on this scripture has very little resemblence to the modern Telugu script.


***

Going home

Our initial plan was to go to India during September 08 and celebrate Spurthi’s third birthday in our home in Hyderabad. Suddenly during 2nd week April, we started talking about going in the summer and we found enough reasons to go immediately.

‘We could eat mangos’

That got Aparna excited about going in summer. Yes, we could eat all the mangos we can eat. Thinking about ‘Cheruku rasam’, ‘Panchadara Kalasi’ etc itself gave us enough sugar boost. Several varieties of mango are grown in South India; in Andhra, the fruit variety mangos are full of sweet juice. To eat those mangos one has to put a puncture on the top, keep the mango in the mouth and suck the juice, while squeezing it with the hand to tender the pulp. Once the juice flow becomes less, the ‘tenka’ (hard shell inside the mango) has to be brought out and licked mercilessly. Then, its time to revisit the ‘thokka’ (skin), bite the bottom side and suck the juice until it is torn. All this may sound like a hassle, particularly when the juice can be store bought, but trust me, the experience of eating a juicy mango like our ancestors did is a divine experience, once you taste that, you will never like the sugar / essence added juice in the bottle. Another incentive for daring to face the heat would be the chance to taste the new pickles, along with the chance to drink sugarcane juice, sweet coconut, ‘Munji’ etc. Summer, also is the time when schools and colleges are closed, so all our school going relatives and Aparna’s mother will be free at home. The more we contemplated, the more we were convinced that summer is the time to go home.

Preparation

I completed 5 years of service in the present company. So, starting this year I have an extra week of vacation for a total of 4 weeks. That looked like enough time. It sure is a long time if one has to go to work / wash dishes / cook everyday. For a vacation, it is short. We need vacation like the academics in Canada i.e. 9 months work and 3 months vacation.

This time I got a very good deal with tickets from skyfly-travels.com. This is also first time we flew to Hyderabad. The new Shamshabad airport is very impressive, thou the customs staff are not. They asked me to pay 50,000 Rs (1250$) customs duty for my lens and camera. I tried to explain to the clerk that I am going back and none of this stuff is new or meant for sale; he said ‘leave these in the air port and pick up when you go back or pay the duty’. The welcome I got from the customs officer made me realize how rational toddlers are compared to the customs officers in Hyderabad. I refused to leave the stuff in the airport - the only reason anyone carries those is to use them – and refused to pay the duty. He then sent me to his superior who was reasonable. I repeated my argument, showed him the return tickets and he let me go. While coming out the guards stopped me for the filled in customs form which I forgot on the clerk’s desk while pulling out other stuff. While I was searching for the forms the guards said ‘don’t worry about it sir, give us something and go’. I understood the meaning of ‘something’, but pretended to have not heard. Went back, collected the form and came out. The flight arrived on time in Hyderabad at 11:15. All this took nearly 3 hours and we came out at 2 am. It is easy to spend millions and build infrastructure, but without proper training of the personnel, coming to this airport is not going to be a pleasant experience for the travelers. I decided never to land in Hyderabad from international travel.

Tirupathi

Aparna had a pending mokku from 02 to visit Tirupathi. She wanted to climb the hill by foot before the darshan. We, along with my mother, flew to Tirupathi on Friday and scheduled the AAD (Archana Anantara Darshanam) for Saturday early morning. We went up the hill to check in, came down and started climbing in the evening. My mother remained in the room with Spurthi, while Aparna, her mother and I started trekking around 6:30 pm. The total distance between Tirupathi and Tirumala is 11 KM and consists of ….. steps. The journey is uphill, so it is not very easy, at the same time it is not impossible for the determined not so in great shape folks. The biggest difficulty is that, one is supposed not to wear any footwear while climbing the hill, since it is considered sacred.

While Aparna and I are in okay shape, her mother is not. On top of that, within a few minutes of starting the walk, Aparna’s mother is hurt from a piece of a broken glass. Her foot started bleeding and we were not carrying any first aid in the purse. She continued the walk with that wound, thou she never sat down in the middle, took frequent breaks. Towards the end, there are 350 steps, each step 18-20 inches tall. That is called ‘Mookaalla Parvatham’. It seems, it got the name because no one can climb that hill without holding their knees with their hands. After crossing that, there are no more steps. It is just a long walk; some times crossing the road. One has to be very careful while crossing the road or walking on the roadside as the chances of bumping on to a vehicle down the hill can be fatal. It took us 5 hours to go up the hill.

We went to the temple on Saturday morning 6 am and came out after darshan with prasad by 8:30 am. Summer is usually very busy time and Saturdays are the busiest. If it took us 2 hours, that means it will take less than 2 hours in other times. This should be encouraging news for people planning a visit to Tirupathi.

Chennai

The fly-over at Mahalinga puram / North usman road is helping the traffic flow near Kodambakkam. I have not seen the horrible traffic jams in this trip. Parking is still a big problem in many parts of the city. One fly-over near Ranganatha Street is under construction. Once that is complete, it is expected to ease the traffic flow near Panagal park area.

Prakash came to Chennai during that time and we went to our usual places like National lodge, Ponnusamy and Bhagavathi Vilas etc. There is nothing to write home about those places any more. I decided to stop going there from next trip. One day I went to Indian Express office, in Ambattor - with Suresh and had lunch in the canteen. The food there was much better than the current NL food. Prakash and I took a sleeper bus for the return journey from Chennai to Hyderabad. It costs about 1000 Rs. (slightly more than third A/c train fare) and takes about 11 hours to reach Hyderabad. Sometimes there can be unexpected traffic jam, like that day when Rambabu was coming from Bangalore to Hyderabad by bus. That bus was scheduled to reach at 6 am. Due to an accident at Nalgonda, it reached around 2 pm. I feel Volvos are a better choice to travel on the road than sleeper buses.

Next time Aparna and I traveled in train with Spurthi. Train journey was very comfortable for travel within India now. Trains run on time, they are clean and economical too.

Accident

In Hyderabad, nobody stops at the red light. I heard this story; one driver stopped the car when the light changed from orange to red. Three vehicles hit him from behind. What kind of stupid, looks at the lights while driving? Drivers in Hyderabad strongly believe that only cowards stop at red light.

Everywhere in city, there are traffic jams. I used to a hire cab almost everyday, as it is cheaper. For 8 hours it costs about 800 Rs. (20$). It looks like there is a demand for cab driver jobs now. Many cab drivers I saw have migrated from nearby villages recently. They do not know the city completely and they do not have enough driving experience. One driver I hired always used to stop in the middle of the road. Once he went opposite side of the road and almost hit a lorry. One day we went to Alfa in Secendrabad for their legendary Biriyani – which by the way is not great IMHO, and hired an auto to come back. The driver of that auto was hardly 18 years. I wondered loudly ‘whether he had license to drive’. He heard that and used a swear word to let me know that I can get out of the auto, if I care about his licensee.

Nothing happened on all these days. One day I was home whole day and went to see off my cousins’ daughter to her house, which is less than 2 miles from where I stay. While coming back in auto another auto hit head-on and a bus and scoter hit my auto from behind. The driver of my auto was in critical condition, while - luckily - I survived without any fractures or major injuries.

Over all this was a great vacation for us. When we started planning the trip, we were concerned about the Indian summer and how Spurthi is going to take it etc. She had wonderful time and we hope she will have a few memories of this trip. She picked up several new words and sentences in Telugu, when her mother repeats some thing; she now says “emite nasugudu”. She can recognize all her grand parents and became friends with Deekshita and Sunitha’s daughters – Sruthi and Madhavi.

The lesson I learned is, if we expect India to offer the comforts in US you will be up for disappointment. If you want comforts, India has many. One example is, if we try to beat the Indian summer with indoor AC, it is difficult. Since the AC is not centralized, coming out and going in makes thing worse. At night, there can be voltage drop or power cut. However, one can throw the shirt off and sit under the mango tree in front of the house. For a good night sleep, take the mat up and sleep on the open terrace. That is what we did. The open sky and the shining stars never stop encouraging us, to find the shining within, and the openness in our own hearts. We had many joy-filled nights.
* * *

Sunday, April 20, 2008

Two shots

One: Spurthi in cargos.
Two: Aparna after their Tamil new year day performance in Jacksonville, Saturday April 19 2008.