Thursday, October 8, 2009
కె. బాలగోపాల్ ఆకస్మిక మరణం
ఇప్పుడే ఆంధ్రజ్యోతి ఆన్ లైన్ లో మానవ హక్కుల నేత కె. బాలగోపాల్ నిన్న రాత్రి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించినట్ట వార్త వచ్చింది.
బాలగోపాల్ మరణం రాష్ర్టంలోనూ, దేశంలోను పౌరహక్కుల ఉద్యమాలకే కాక ప్రత్యామ్నాయ రాజకీయ కార్యాచరణకీ తీరని లేటు.
వివరాలు యిక్కడ.
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/oct/8new78
Subscribe to:
Post Comments (Atom)
అయ్యో .............!
ReplyDeleteనిన్న గాక మొన్న అక్టోబర్ 7 ననే కదా ఇదే ఆంద్ర జ్యోతి ఆయన రాసిన "దొడ్డిదారిన మరో విపత్తు" వ్యాసాన్ని ప్రచురించింది. అప్పుడే ఇంత దారుణమైన వార్త తో గుండెలు అవిసిపోఎట్టు చేయాలా ! "దొడ్డిదారిన మరో విపత్తు" అంటే ఇదా......?!
మిట్ట మధ్యాహ్నం సూర్యుడు అంతర్ధానమైనట్టుంది.
జోహార్ కామ్రేడ్ బాల గోపాల్ !
రాజకీయ నాయకుల్ని గుడ్డిగా నమ్మి వోట్లు వెయ్యడమే ప్రజాస్వామ్యం అనుకునే దేశంలో రాజ్య హింస (state violence) విషయంలో జనాన్ని ఆలోచింపచేసిన మహా ఆలోచనపరుడు బాలగోపాల్. అతను ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన మరో బినాయక్ సేన్.
ReplyDelete'తీరని లోటు ' అని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మరణానంతరం ఆలోచన లేకుండా ఉపయోగిస్తున్న ఈ మాట, అనిపించుకొనే అర్హత ఉన్న కొందరిలో ఈయన ఒకరు.
ReplyDeleteజోహార్ బాలగోపాల్ గారు.
బాలగోపాల్ గారిని ఎంత మంది విమర్శించినా పట్టించుకునేవారు కాదు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నాడు "బాలగోపాల్ ఒక నక్సలైట్, దేశంలో ఉన్న నక్సలైట్లందరినీ వదిలెయ్యమంటాడు" అని. ఆ ప్రాసిక్యూటర్ గారి ఆరోపణ విని నాకు నవ్వొచ్చింది.
ReplyDelete